Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి నివాసంలో దిగ్విజయంగా ముసిగిన చండీయాగం

రేవంత్ రెడ్డి నివాసంలో దిగ్విజయంగా ముసిగిన చండీయాగం

రేవంత్ రెడ్డి నివాసంలో దిగ్విజయంగా ముసిగిన చండీయాగం
X

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసంలో చండీయాగం దిగ్విజయంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన యాగంలో చివరి రోజున రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రజారంజక పాలన రావాలని కోరుకున్నట్లు చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ప్రార్థించానని అన్నారు.

చండీయాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్దించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణకు మంచిరోజులు వస్తాయని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమానస్థాయిలో ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొండంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ స్థాయికి వచ్చానన్న రేవంత్.. చండీయాగం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Updated : 29 Sept 2023 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top