Chandrayaan-3: చంద్రయాన్-3 విడి భాగాలు.. కూకట్పల్లి నుంచి ఎగుమతి
X
భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్-3. భారత కీర్తిని మరింత పైకి తీసుకెళ్లే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని అంతా కోరుకుంటున్నారు. ఈ మహత్తరమైన ప్రాజెక్ట్ లో విశ్వ నగరం హైదరాబాద్ కూడా పాలు పంచుకుంది. చంద్రయాన్-3కి అమర్చిన విడి భాగాలు కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ నుంచి ఎగుమతి చేశారు. వివరాల్లోకి వెళ్తే..
కూకట్ పల్లిలో ఉన్న నాగసాయి ప్రెసెసియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ కంపెనీ.. చంద్రయాన్-3 విడి భాగాలను తయారుచేసింది. రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను ఇక్కడే తయారు చేశారు. కంపెనీ యజమాని డీఎన్ రెడ్డి.. 1998 నుంచి ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ కు విడి భాగాలు అందిస్తూ వచ్చారు. అలా ఇప్పటి వరకు 50కి పైగా శాటిలైట్స్ కు విడి భాగాలు అందించారు. ఆయన సేవలకు గానూ కేంద్ర రక్షణ శాఖ నాగసాయి కంపెనీపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమోదముద్ర వేసింది.