Home > తెలంగాణ > CA Results 2023 : సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల..

CA Results 2023 : సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల..

CA Results 2023 : సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల..
X

ఛార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్జర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా గతేడాది నవంబర్ లో సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించింది. మంగళవారం ఫలితాలు వెలువడగా.. సీఏ ఇంటర్ గూప్ 1లో 16.78, గ్రూప్ 2లో 19.18 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సీఏ ఫైనల్ ఎగ్జామ్లో కేవలం 9.46 శాతం మంది పాసయ్యారు.

సీఏ ఫైనల్లో జైపూర్కు చెందిన మాధుర్ జైన్ ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అతను 77.38శాతం మార్కులు సాధించాడు. 800లకు గానూ అతను 619 మార్కులు స్కోర్ చేశాడు. ముంబైకి చెందిన సంస్కృతి అతుల్ పరోలియా 599 మార్కులతో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. జైపూర్కు చెందిన తికేంద్ర కుమార్ సింఘాల్, అదే ప్రాంతానికి చెందిన రిషీ మల్హోత్రాలు 590 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. సీఏ ఫైనల్ ఎగ్జామ్ క్లియర్ చేయడంతో వీరంతా ఇకపై చార్టర్డ్ అకౌంటెంట్లుగా ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది.

ఇక సీఏ ఇంటర్లో జై దేవాంగ్ జిములియా 800లకు గానూ 691 మార్కులు సాధించి 86.38 పర్సంటేజ్తో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 688 మార్కులతో అహ్మదాబాద్ కు చెందిన భగేరియా తనేయ్ సెకండ్, 668 మార్కులతో సూరత్కు చెందిన రిషి హిమాన్షు కుమార్ మేవావాలా థర్డ్ ర్యాంక్ సాధించారు.

2023 నవంబర్లో నిర్వహించిన సీఏ ఫైనల్ ఎగ్జామ్కు 65,294 మంది విద్యార్థులు హాజరుకాగా.. కేవలం 6,176 మంది మాత్రమే పాస్ అయ్యారు. సీఏ ఇంటర్ గ్రూప్ 2 కోసం హాజరైన 93,638 మంది విద్యార్థుల్లో 17,957 మంది క్వాలిఫై అయ్యారు. సీఏ ఇంటర్ గ్రూప్ 1కు 1,17,304 మంది హాజరుకాగా.. 19,686 మంది పాసయ్యారు.

Updated : 9 Jan 2024 7:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top