Boath MLA Rathod Bapurao :బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు
X
బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బాపూరావు మోసం చేశారని.. 2012లో విక్రయించిన 2 ఇళ్ల స్థలాలను రెండోసారి అమ్మారని ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. బాపూరావు, సుదర్శన్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
మరోవైపె ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఆయనకు బోథ్ టికెట్ ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అతిత్వరలోనే ఆయన ఆయన హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ సారి బోథ్ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావుకు కాకుండా అనిల్ జాదవ్‌కి కేటాయించారు గులాబీ బాస్. అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో రేవంత్ ను కలవడంతో ఆయన కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కన్పిస్తోంది.