Home > తెలంగాణ > హైదరాబాద్‎లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్

హైదరాబాద్‎లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్

హైదరాబాద్‎లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
X

హైదరాబాద్‎లో మరోసారి చెడ్డీగ్యాంగ్ సంచారం ఆందోళనకు గురిచేస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత నగరంలో దోపిడీకిలకు పాల్పడుతున్నారు. తాజాగా మియాపూర్ పీఎస్ పరిధిలోని చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. నోవాటెల్ సమీపంలోని వసంత విల్లాస్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీ చేసింది. తాళం వేసి ఉన్న ఓ విల్లాలోకి బొరబడిన చెడ్డీ గ్యాంగ్.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చెడ్డీ గ్యాంగ్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మియాపూర్, రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు కోసం వేట కొనసాగుతోంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు నుంచి చెడ్డి గ్యాంగ్ సభ్యులు వస్తారు. వీరు దొంగతనాలకు పాల్పడటంతోపాటు హత్యలకు కూడా వెనుకాడరు. మారణాయుధాలతో రాత్రుళ్లు సంచిరిస్తూ దొంగతనాలు చేస్తారు. ఆ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారిని చంపేస్తారు. వీరు దొంగతనాలకు వెళ్లే సమయంలో కేవలం చెడ్డీలు మాత్రమే ధరిస్తారు.ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు ఒంటికి నూనె కూడా రాసుకుంటారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడింది. మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతోంది.






Updated : 11 Aug 2023 8:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top