సంగారెడ్డిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
X
తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ రెచ్చిపోతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, రాచంద్రాపురంలోని వరుస దొంగతనాలకు పాల్పడింది. చెడ్డీలు, చేతిలో మారణాయుధాలతో ఈ దొంగలు తిరుగుతున్నారు. తాళాలు వేసుకుని ఉన్న ఇళ్ళను టార్గెట్ చేస్తున్నారు.
అమీన్ పూర్ లోని తాళాలు వేసి ఉన్న మూడు ఇళ్ళల్లోకి చొరబడి 11 తులాల బంగారం, 10 వేల క్యాష్ ఎత్తుకెళ్ళారు. చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న విజువల్స్ ను అక్కడి లోకల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ , అక్టోబర్ లలో ఇలాగే వరుస దొంగతనాలు చేశారు చెడ్డీ గ్యాంగ్. అప్పుడు కూడా సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో దొంగతనాలు జరిగాయి. ఇదయ్యాక జనవరి8న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, జనవరి 13న ఎల్బీనగర్ లో, జనవరి 15న జగిత్యాల జిల్లాలో, జనవరి 20న మహబూబ్ నగర్ లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఎప్పటికప్పుడు పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఇప్పటివరకూ ఈ చెడ్డీ గ్యాంగ్ మాత్రం పోలీసులకు దొరకడం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా వీళ్ళు మారణాయుధాలతో తిరగడం జనాలను భయపెడుతోంది.