Home > తెలంగాణ > కాంగ్రెస్ గూటికి చేరిన ఓదెల.. బీజేపీ నో అనడంతో...

కాంగ్రెస్ గూటికి చేరిన ఓదెల.. బీజేపీ నో అనడంతో...

కాంగ్రెస్ గూటికి చేరిన ఓదెల.. బీజేపీ నో అనడంతో...
X

బీఆరెఎస్ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు మరో చోట అవకాశాలు వెతుక్కుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత నల్లాల ఓదెలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. శక్రవారం హైదరాబాద్‌లో ‘హస్తం’ కార్యాలయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జి ఠాక్రే తదితరుల సమక్షంలో మువ్వన్నెల జెండా కప్పుకున్నారు. దీంతో ఆయన గులాబీ పార్టీని వీడతారని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి.

బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడతో ఓదెలు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటివరకు తమను తిట్టిపోసిన పార్టీ నేతలను చేర్చుకుంటే విమర్శలు వస్తాయని కమలనాథుల పట్టించుకోలేదు. టికెట్ కోసమే పార్టీలో చేరుతున్నారని, ఆయనకు టికెట్ ఇస్తే కార్యకర్తలు తిరగబడతారని జంకినట్లు సమాచారం. దీంతో ఓదెలు చేసేదేమీ లేక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఓదెలును చేర్చుకోవడానికి ఓకే చెప్పిన నేతలు పార్టీ టికెట్ కష్టమని అన్నారట. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించ వడపోత కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓదెలుకు టికెట్ కష్టమే.

కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఓదెలు పార్టీలు మారుతూ ప్రతిష్ట మసకబార్చుకున్నారు. 2009లో నాటి టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఆయన ప్రత్యేక రాష్ట్ర డిమాంత్‌తో 2010లో రాజీనామా చేశారు. అదే ఏడాది జరిగిన ఉపఎన్నికలో గెలిచారు. 2014లోనూ గెలిచి ప్రభుత్వం చీఫ్ విప్‌ అయ్యారు. 2022లో బీఆర్ఎస్‌ను ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్టోబర్ మళ్లీ బీఆర్ఎస్‌లో చేరారు. ఏడాది తిరిగేసరికి మళ్లీ కాంగ్రెస్ వైపు షటిల్ కాక్‌లా వచ్చిపడ్డారు.


Updated : 15 Sep 2023 2:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top