విశాఖ ఇండస్ట్రీలో అవకతవకలు.. ఈడీ విచారణకు గడ్డం వివేక్
Kiran | 18 Jan 2024 4:43 PM IST
X
X
చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. విశాక ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లారు. రూ. 8కోట్ల బ్యాంకు లావాదేవీలపై తెలంగాణ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాక ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఇవాళ వివేక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో విశాక సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Updated : 18 Jan 2024 4:43 PM IST
Tags: telangana news telugu news tsnews ts politics congress mla chennur mla gaddam vivek visaka industries ms vigilence securities bank transactions vivek venkata swamy property documents
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire