Home > తెలంగాణ > భూవివాదంలో ట్విస్ట్.. MLA ముత్తిరెడ్డి కూతురిపై కేసు

భూవివాదంలో ట్విస్ట్.. MLA ముత్తిరెడ్డి కూతురిపై కేసు

భూవివాదంలో ట్విస్ట్.. MLA ముత్తిరెడ్డి కూతురిపై కేసు
X

ఓ స్థలానికి సంబంధించిన వివాదంలో తన తండ్రి కబ్జా చేశారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జాభవాని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చేర్యాలలో తన తండ్రి భూమిని కబ్జా చేశారని, అందుకు క్షమాపణలు తెలియజేస్తూ.. తనపైరుపై ఉన్న ఆ భూమిని మున్సిపాలిటికే ఇచ్చేస్తున్నానని ఆమె ప్రకటించారు. అయితే తాజాగా ఆమెపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. సోమవారం ఉదయం చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు తుల్జా భవాని. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు.





గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ, ఆమె తండ్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వివాదం నడుస్తోంది. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు నిన్ననే ప్రకటించారు భవానీ. ఈ క్రమంలో 1,270 గజాల స్థలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ని కూల్చివేశారు. అయితే, ఆ ఫెన్సింగ్‌తో పాటు తన స్థలంలో వేసుకున్న ఫెన్సింగ్‌‌ను కూడా కూల్చివేసిందని పొరుగు ల్యాండ్ ఓనర్ రాజు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే, తండ్రి ముత్తిరెడ్డే తనపై కేసులు పెట్టించారని భవానీ ఆరోపిస్తుండగా.. తన కూతురును ఇతర రాజకీయ పార్టీలు ట్రాప్ చేశాయని ముత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 27 Jun 2023 4:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top