Central Election Commission: ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు ఎక్కడా జరగలేదు.. సీఈసీ
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడో రోజు పర్యటిస్తోంది. టెక్ మహింద్రాలో దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో సీఈసీ రాజ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం సమావేశమైంది. ఓటు హక్కుపై అవగాహన కల్పించింది.
హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడో రోజు పర్యటిస్తోంది. తమ పర్యటనలో భాగం గురువారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీంగ్ ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణపై చర్చ జరిపారు. అంతకు ముందు మొదటి రోజున రాజకీయ పార్టీల ప్రతినిధులతో, రెండో రోజున కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశమై పలు అభ్యంతరాలు, ఎన్నికల నిర్వహణ, భద్రతా అంశాలపై జరిపారు.
ఈ మూడు రోజుల పర్యటనలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇక 3 వ రోజైన గురువారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో ముందుగానే సమావేశమయ్యామని, రెండో రోజు ఎన్ ఫోర్స్‌మెంట్ సంస్థలతో భేటీ అయ్యామని తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరాయని చెప్పారు.
ఇక రాష్ట్రంలో ఓట్లను తొలగించారన్న విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో.. సీఈసీ వాటిపై క్లారిటీ ఇస్తూ.. ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు ఎక్కడా జరగలేదన్నారు. ఫామ్ అదిన తర్వాతే ఓటర్ల తొలగింపు ప్రక్రియ జరిగిందన్నారు. మరణాలున్నా ధృవీకరణ తర్వాతే ఓటర్లను తొలగించామని చెప్పారు. 2022-23లో మొత్తంగా 22 లక్షల ఓటర్ల తొలగింపు జరిగిందని, ఓటర్ల జాబితా ఎంతో పారదర్శకంగా రూపొందించామని తెలిపారు. మూడు రోజుల పర్యటన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు.. వారిలో స్త్రీ, పురుషుల జనాభా కాస్త అటు ఇటుగా 1.57 కోట్లకు దగ్గరగా ఉందన్నారు. మిగతావారిలో ట్రాన్స్ జెండర్లు 2557 ఉండగా.. వందేళ్ల దాటిన వారు 7600 మంది ఉన్నారని చెప్పారు. అంతకుముందు ఈ ఉదయం టెక్ మహింద్రాలో దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో సీఈసీ రాజ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం సమావేశమైంది. ఓటు హక్కుపై అవగాహన కల్పించింది.