Home > తెలంగాణ > అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి - సీఈఓ వికాస్ రాజ్

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి - సీఈఓ వికాస్ రాజ్

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి - సీఈఓ వికాస్ రాజ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈఓ వికాస్‌రాజ్ చెప్పారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులు వారి ప్రతినిధులు ఎదుట ఈవీఎంల కమిషనింగ్ పూర్తైందని చెప్పారు. ఈవీఎంలన్నీ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తైందని వికాస్ రాజ్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఎన్నికల విధుల కోసం 2.5లక్షల మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. 45వేల మంది తెలంగాణ పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన హోం గార్డుల సేవలు వినియోగించుకుంటున్నామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్ అందుబాటులోకి ఉంచినట్లు వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ కు 48గంటల ముందు నుంచే 144 సెక్షన్ అమలుల్లో వస్తుందని స్పష్టం చేశారు.

Updated : 26 Nov 2023 9:49 PM IST
Tags:    
Next Story
Share it
Top