Home > తెలంగాణ > రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా రజిని సాయి చంద్

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా రజిని సాయి చంద్

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా రజిని సాయి చంద్
X

ప్రముఖ గాయకుడు , రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్ ఇటీవల గుండెనొప్పి తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిచంద్ మరణం యావత్ తెలంగాణను శోకసంద్రంలో పడేసింది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెంట ఉంటూ..పార్టీ లో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్నలను పొందిన సాయి..హఠాన్మరణం అందర్నీ కన్నీరు పెట్టించింది. ఆయన దశదిన కర్మ కార్యక్రమాన్ని ఈ ఆదివారం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇదిలా ఉండగా తాజాగా... సాయిచంద్ బార్య రజనీకి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయిచంద్ భార్య రజనీ ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే ఆయన కుటుంబానికి రూ.1.50 కోట్ల రూపాయలను అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.





రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన సాయిచంద్ ఇటీవల 39 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్రం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు నేరుగా పరిచయం లేకున్నా ఆయన పాటతో పరిచయం ఉన్న వారందరూ సైతం కన్నీరుమున్నీరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.








Updated : 7 July 2023 1:44 PM IST
Tags:    
Next Story
Share it
Top