Home > తెలంగాణ > Revanth Reddy : రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy : రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy  : రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ల అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తమని సీఎం రేవంత్ అన్నారు. . దశలవారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. రూ.97 కోట్లు కేటాయించారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేశామని సీఎం తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, అన్నదాతకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఏర్పాటు చేయనున్నారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం, తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.




Updated : 6 March 2024 12:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top