Revanth Reddy : నేడు సచివాలయంలో TSPSCపై సీఎం రేవంత్ సమీక్ష
X
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో టీఎస్‌పీఎస్‌సీ పై సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు టీఎస్‌పీఎస్సీ పై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ సహా..కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా.. రాజీనామాలను ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా... TSPSC ప్రక్షాళన చేపట్టాలా.. అనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
కాగా కొన్నిరోజుల క్రితం సచివాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులు గాబరాపడొద్దని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బోర్డు ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో, బోర్డు ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని తెలిపారు. సభ్యుల రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత నాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులను పరిష్కరించి కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షలపై త్వరలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో నిర్వహించబోయే సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.