Gruha Jyothi Scheme:మరికాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమావేశం
X
ఆరుగ్యారంటీల్లోని మరో రెండు పథకాలకు సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీతో భేటీ కానున్నారు. ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెండు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గృహజ్యో,తి పథకానికి సంబంధించి బుధవారం కోస్గీ సభలో.. వారం రోజుల్లో రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం. తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఆసక్తిగా మారింది. గృహజ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు పురపాలక, ఆర్ డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ బేటీ అనంతరం రెండు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విద్యుత్ సిబ్బంది లేదా స్థానిక అధికారులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. ప్రజాపాలన దరఖాస్తు రశీదు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ మీటర్ సంఖ్య వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆధార్ సంఖ్యతో కరెంటు మీటర్ సంఖ్యను లింక్ చేసి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించనున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే ఈ స్కీమ్ లో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ధ్రువీకరణ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆధార్ ఆథేంటింకేషన్ పూర్తి చేయాలని డిస్కంలకు సూచించింది. వేలిముద్రలు, కనుగుడ్లు స్కాన్ చేసి ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి. అదీ కుదరకపోతే ఆధార్ కార్డులపై ఉండే క్యూర్ కోడ్ ను స్కాన్ చేసి ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.