బోనాల వేళ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరార్
X
హైదరాబాద్ లో ఆదివారం (జులై 15) జరిగిన లాల్ దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ చేసిన ఓవరాక్షన్ గురించి అందరికీ తెలిసిందే. ఆలయంలోకి గన్స్ తో కూడిన ప్రైవేట్ సెక్యూరిటీతో ప్రవేశించగా వివాదం అయింది. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దాంతో ప్రస్తుతం చికోటి ప్రవీణ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. దాంతో ఆయన పరారీలో ఉన్నాడు.
ఈ కేసులో చికోటి ప్రవీణ్ ను పోలీసులు ఏ1 ముద్దాయిగా చేర్చారు. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద ప్రవీణ్ పై కేసు నమోదు చేశారు. అతని సిబ్బంది దగ్గర లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రవీణ్ సహా మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిపై కేసు రిజిస్టర్ చేశారు. కాగా, సెక్యూరిటీగా వచ్చిన ముగ్గురు రిటైర్డ్ సిఆర్పీఎఫ్ జవాన్లు. వాళ్లకు జీతం సరిపోకపోయే సరికి చికోటి ప్రవీణ్ వద్ద సెక్యూరిటీగా చేరారు.