సెక్యూరిటీ కేసులో చికోటి ప్రవీణ్‌కు షాక్..
X
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు పోలీసులు షాకిచ్చారు. తన సెక్యూరిటీ కేసులో చికోటి ప్రవీణ్ కుమార్‌ను ఏ - 1 గా ఛత్రినాక పోలీసులు చేర్చారు. ఏ2గా సుందర్ నాయక్, ఏ 3 గా రమేష్ గౌడ్, ఏ 4 గా రాకేష్ లను చేర్చి ముగ్గురు సెక్యూరిటీని రిమాండ్‌కు తరలించారు.
బోనాల సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకునే సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీతో చికోటి ప్రవీణ్ హల్చల్ చేశారు. వెపన్స్ తో బోనాల జాతరకు చికోటి సెక్యూరిటీ వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అతని గార్డుల తుపాకీ లైసెన్సులు ఫోర్జరీ లైసెన్సులని తేల్చి కేసు నమోదు చేశారు. అనంతరం చికోటి సెక్యూరిటీని రిమాండ్‌కు తరలించారు.
రెండు నెలల క్రితం చికోటి ప్రవీణ్‌ను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పటాయలోని ఓ హోటల్ లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా చికోటితో పాటు 90 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో క్యాసినో నిర్వహిస్తూ ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. ఇతనిపై మనీలాండరింగ్ అభియోగాలు కూడా ఉన్నాయి. ఈడీ కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. తరచూ ఏదో ఒక వివాదం చికోటిని వెంటాడుతూనే ఉంది.