Home > తెలంగాణ > Chikoti Praveen: బీజేపీలో చేరిన క్యాసినో కింగ్.. పార్టీ కండువా కప్పిన..

Chikoti Praveen: బీజేపీలో చేరిన క్యాసినో కింగ్.. పార్టీ కండువా కప్పిన..

Chikoti Praveen: బీజేపీలో చేరిన క్యాసినో కింగ్.. పార్టీ కండువా కప్పిన..
X

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ తమ యాక్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొన్ని పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. బర్కాత్ పుర లోని బీజేపీ ఆఫీస్ లో శనివారం చీకోటి ప్రవీణ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా గతంలోనే చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరాల్సి ఉంది. తాను నివాసం ఉండే ఎల్బీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని.. భారీ సంఖ్యలో ఫాలోవర్స్‎ను వెంటబెట్టుకుని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. కానీ, చివరి నిమిషంలో బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో అనుకోని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చికోటి చేరికకు బ్రేకులు పడ్డాయి.

తర్వాత చీకోటి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర నేతలతో వరుసగా భేటీ అయ్యారు. బండి సంజయ్, డీకే అరుణను కలిశారు. బీజేపీలో చేరాలనే తన అభిప్రాయాన్ని వారితో పంచుకున్నారు. దీంతో చీకోటి చేరికపై బండి సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీజేపీ పెద్దలతో సమావేశం జరిపిన బండి సంజయ్.. చీకోటి చేరకను కన్ఫార్మ్ చేశారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీకోటి ప్రవీణ్ ఎల్బీనగర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. రేషన్ షాపు నడపటం నుంచి మొదలు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి క్యాసినో కింగ్‌గా చీకోటి ప్రవీణ్‌ పేరు తెచ్చుకున్నాడు. ఆయనపై ఈడీ కేసులు కూడా ఉన్నాయి. థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసినో వ్యవహారాల్లో కూడా చీకోటి ప్రవీణ్ పేరు వినిపించింది.



Updated : 7 Oct 2023 3:13 PM IST
Tags:    
Next Story
Share it
Top