Home > తెలంగాణ > Chinnareddy : బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలే..చిన్నారెడ్డి

Chinnareddy : బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలే..చిన్నారెడ్డి

Chinnareddy : బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలే..చిన్నారెడ్డి
X

బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నిరుద్యోగ యువతను కేసీఆర్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. ఆఖరికి గొర్రెలు, ఆవుల పంపిణీల్లో సైతం బీఆర్ఎస్ నేతలు తమ చేతివాటం ప్రదర్శించారన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కడంలేదని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఆచరణకు నోచుకొని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. గత పనులకు సంబంధించి సుమారు రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అద్వానంగా తయారు చేశారని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పేందుకు వీలుగా ప్రజావాణి ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణి ఇన్‌ఛార్జ్‌గా తనపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత ఉంచారన్నారు. ఇప్పటి వరకు 4.90లక్షల అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో నాలుగు లక్షలు సమస్యలను పరిష్కరించే దిశగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు పూర్తి కాకముందే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని.. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాకముందే మిగిలిన హామీలనూ అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పనితీరుపై చిన్నారెడ్డి విమర్శలు చేశారు.




Updated : 29 Feb 2024 7:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top