Banjara Hills Police Station: బంజారాహిల్స్ సీఐకి గుండె నొప్పి.. కారణం ఏంటంటే?
X
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. స్కై లాంజ్ పబ్ ఎండీని సీఐ నరేందర్ బెదిరించి, డబ్బులు డిమాండ్ చేయడంతో.. ఆ పబ్ ఓనర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. స్కైలాంజ్ పబ్ ఓనర్ తో మొదట రూ. 4.5 లక్షల బేరం కుదుర్చుకున్న సీఐ నరేందర్.. ఆ తర్వాత కొంత తగ్గి రూ.3 లక్షలకు డీల్ ఓకే అయింది. ఇందులోని రూ.50 వేలు పబ్ ఓనర్ గతంలోనే సీఐ నరేందర్ కు చెల్లించాడు. ఆ సమయంలో పబ్ ఓనర్ వీడియో రికార్డ్ చేశాడు. జూన్ నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పబ్ ఓనర్ ఫిర్యాదుపై తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పబ్ ఓనర్ ఫిర్యాదుతో సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డ్ హరి లంచం అడిగినట్లు తేలింది. ప్రస్తుతం ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది ఎస్ఐలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ పక్కా అధికారాలతో సోదాలు నిర్వహిస్తుంది. కాగా ఈ కేసులో సీఐ నరేందర్ ఏ1గా చేర్చింది. ఏ2గా ఎస్సై నవీన్ రెడ్డి, ఏ3గా హోంగార్డ్ హరి పేర్లను చేర్చి కేసు నమోదు చేసింది. సీఐ నరేందర్ చాంబర్ తో పాటు, ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో సీఐ నరేందర్ చాతినొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు అపోలో హాస్పిటల్ కు తరలించారు.