డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన కమాండ్ కంట్రోల్ రూం సీఐ
X
హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో అతనో సీఐ. ప్రస్తుతం డీఎస్పీ ప్రమోషన్స్ లిస్ట్ లో ఉన్నాడు. అంతా బాగానే ఉంది. ఇంతలో ఓ కేస్. ఆయన చేసిన పనికి ప్రమోషన్స్ అటుంచితే ఇప్పుడు జాబ్ ఉంటుందో ఊడుతుందో అనేది డౌట్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. శుక్రవారం రాత్రి తప్పతాగి తన కారుతో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా అందులో ఉన్న డ్రైవర్ శ్రీధర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ శ్రీనివాస్ కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జయింది. ప్రమాదానికి కారణమైన సీఐ కారును బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత సీఐకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా అందులో 210 పాయింట్లు వచ్చింది. ప్రస్తుతం వ్యాన్ డ్రైవర్ శ్రీధర్ పరిస్థితి నిలకడగానే ఉంది. గాయాల నుంచి కోలుకుంటున్నాడు.