Home > తెలంగాణ > మంచు లక్ష్మక్క మంచి మనసు..సర్కారీ స్కూల్స్ దత్తత

మంచు లక్ష్మక్క మంచి మనసు..సర్కారీ స్కూల్స్ దత్తత

మంచు లక్ష్మక్క మంచి మనసు..సర్కారీ స్కూల్స్ దత్తత
X

సర్కారీ బడుల్లో చదివే స్టూడెంట్స్‎కు మరింత మెరుగైన విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో సినీనటి మంచు లక్ష్మీ , టీచ్ ఫర్ ఛేంజ్ అనే ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రైవేట్ స్కూల్స్‎లో చదివే విద్యార్థులకు సమానంగా ఇంగ్లీష్ రాయడంలో, చదవడంలో మాట్లాడటంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెళకువలను నేర్పించేందకు ఈ కాన్సెప్ట్‎తో ముందుకు వచ్చారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాకు వెళ్లిన లక్ష్మీ ,జిల్లా కలెక్టర్ క్రాంతిని కలిశారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా 30 ప్రభుత్వ స్కూల్స్‎ను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.

" మా సంస్థ ద్వారా గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని 56 పాఠశాలల్లో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమం అమలు చేసింది. మంచి ఫలితాలు అందుకున్నాము. అదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని స్టూడెంట్స్‎కు డిజిటల్‌ విద్యను అందిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా విద్యాబోధన మూడు స్థాయిల్లో జరుగుతుంది. ముందుగా మొదటి తరగత నుంచి ఐదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. అందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 స్కూల్స్‎ను ఎంపిక చేసి వాటిని దత్తత తీసుకున్నాము. ఈ స్కూల్స్‎లో టీవీ, వాల్‌పేయింటింగ్‌, కార్పెట్స్‌, వంటి ఇతర టీచింగ్ సామగ్రి సమకూరుస్తాం. 30 పాఠశాలల్లో వసతులు కల్పనకు సంబంధించి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నాం.





Updated : 29 Jun 2023 12:20 PM IST
Tags:    
Next Story
Share it
Top