Home > తెలంగాణ > కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్..? క్లారిటీ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్

కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్..? క్లారిటీ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్

కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్..? క్లారిటీ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్
X

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నట్లు.. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి చేసిన ట్వీట్... చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ తప్పించుకోవడానికి ఆమె కేంద్రానికి వెళ్లనున్నారనేది ఆ ట్వీట్ సారాంశం. ఈ విషయంపై పలు మీడియా సంస్థల్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి. స్మితా సబర్వాల్ తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేశాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ స్మితా సబర్వాల్ స్వయంగా ట్వీట్ చేస్తూ.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడమనేది పూర్తిగా ఫేక్ న్యూస్ అని, తెలంగాణ రాష్ట్రంలోనే ఏ బాధ్యతని అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ఆమె చేసిన ట్వీట్ ని పరిశీలిస్తే... "నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెళ్లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశాను. ఏ ఆధారం లేని ఆ వార్త వైరలవుతోంది. అది పూర్తిగా అబద్ధం. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిగా, తెలంగాణ ప్రభుత్వం నాకు తగినదిగా భావించే ఏ బాధ్యతనైనా నేను నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను"అని స్మితా సబర్వాల్ తెలిపారు.

కాగా స్మితా సబర్వాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కు అడిషనల్ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం ఆమె నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు స్మితా సబర్వాల్ సీఎంను కలవకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ ను కేంద్రానికి పంపి ఆమె స్థానంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలిని రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Updated : 14 Dec 2023 2:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top