Home > తెలంగాణ > గురుకుల హాస్టల్‌‌లో విషాదం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

గురుకుల హాస్టల్‌‌లో విషాదం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

గురుకుల హాస్టల్‌‌లో విషాదం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
X

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బీసీ గురుకుల హాస్టల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరగ్గా.. గురువారం ఉదయం హాస్టల్‌లోని తోటి విద్యార్థులు చూడడంతో వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న, జయలక్ష్మిల కుమారుడు రాకేష్ (16) మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్‌లో చదువుతున్న రాజేష్ బుధవారం రాత్రి హాస్టల్‌లోని పాత మరుగుదొడ్ల సమీపంలోని రేకుల షెడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారు జామున తోటి విద్యార్థులు చూసి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు.

అయితే రాకేష్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరివేసుకోవడం చూసిన తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదని, కాళ్లు నేలపైనే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే.. గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం పాఠశాల వదిలి కొందరు విద్యార్థులు గ్రామాలకు వెళ్లి డప్పులు కొట్టినట్లు సమాచారం. అయితే హాస్టల్ నుంచి బయటకు వెళ్లి డప్పులు కొట్టడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ లెక్చరర్.. విద్యార్థులను తీవ్రంగా మందలించాడని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు. మరికొందరు హాస్టల్‌ గదుల్లో అద్దెలు నిషేధించాలంటూ వార్డెన్‌ మందలించారని అంటున్నారు. ఈ కారణాలతోనే రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. అంతేకాకుండా తమ కుమారుడి హత్యను, ఆత్మహత్యగా వార్డెన్ చిత్రీకరిస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.




Updated : 28 Sep 2023 8:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top