తుమ్మలతో భట్టి భేటీ.. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం..
X
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు రాని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలవాలనుకున్న తుమ్మలకు బీఆర్ఎస్కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే రేవంత్ తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తుమ్మలను కలిశారు. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో వీరి భేటీ జరిగింది. సుమారు గంటపాటు నేతలిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. భట్టి ఆహ్వానంపై స్పందించిన తుమ్మల తన అనుచరులు, మద్ధతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల మచ్చలేని వ్యక్తి అని భట్టి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన అవసరం ప్రజలకు ఉందన్నారు.
కాగా ఈ నెల 6న తుమ్మల కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. పార్టీ అగ్రనేత రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఇటీవలె కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తుమ్మలను కలిశారు. తనను బీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్లోకి తీసుకెళ్లిందే తుమ్మల అని చెప్పారు. నేతల చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు కొత్త జోష్ వచ్చింది.