Home > తెలంగాణ > దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరు - భట్టి విక్రమార్క

దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరు - భట్టి విక్రమార్క

దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరు - భట్టి విక్రమార్క
X

మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చి 10ఏండ్లైనా ఎలాంటి అభివృద్ధి చేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పాలకులు దోచుకుతిన్నారని ఆరోపించారు. ఈసారి ఎన్నికలు దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని భట్టి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు స్థలం ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అందరిది అని అందుకే సంపద కూడా అందరికీ చెందాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో గోవిందాపురం నుంచి మోటమర్రి వరకు రోడ్డు నిర్మిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Updated : 13 Nov 2023 12:13 PM IST
Tags:    
Next Story
Share it
Top