Home > తెలంగాణ > CM Breakfast: ఇడ్లీ బాగుందా.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రులు

CM Breakfast: ఇడ్లీ బాగుందా.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రులు

CM Breakfast: ఇడ్లీ బాగుందా.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రులు
X

ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్‌ స్కూల్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్‌ రావు (Minister Harish Rao) ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలిసి టిఫిన్‌ చేశారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కలిసి టిఫిన్‌ చేసిన మంత్రి.. రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రతిరోజు పాఠశాల ప్రారంభానికి.. 45 నిమిషాల ముందు అల్పాహారాన్ని వడ్డించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేసీఆర్ సర్కార్. ఇప్పటికే మధ్యాహ్నం భోజనం(Midday Meals Scheme) ద్వారా చిన్నారుల కడుపు నింపుతున్న సర్కారు... బడికి వచ్చే సమయంలో ఏం తినకుండా వస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి(CM Breakfast Scheme) శ్రీకారం చుట్టింది.

Updated : 6 Oct 2023 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top