Home > తెలంగాణ > సూర్యాపేట జిల్లాపై సీఎం వరాల జల్లు

సూర్యాపేట జిల్లాపై సీఎం వరాల జల్లు

సూర్యాపేట జిల్లాపై సీఎం వరాల జల్లు
X

సూర్యాపేట జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాలు జల్లు కురిపించారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రగతి నివేదన సభకు పాల్గొన్న ఆయన జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.

సూర్యాపేటకు కళాభారతి కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని సీఎం చెప్పారు. ఆయన కోరినట్లుగానే కళాభారతి నిర్మాణానికి రూ.రూ.25కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసుకు ధీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు. జిల్లాకు మహిళా పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు చెప్పిన జగదీశ్ రెడ్డి.. స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాకు ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.

cm kcr announced rs 25 crores to 5 municipalities in suryapet district

telangana,nalgonda,suryapet,cm kcr,gram panchayat,10 lakhs funds,suryapet muncipality,kodad,huzur nagar,nereducharla,tirumalagiri,rs 25 crore funds,minister jagdeesh reddy,women polytechnic college,sports school,stadium

Updated : 20 Aug 2023 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top