Home > తెలంగాణ > ప్రతి మున్సిపాలిటీకి రూ.30 కోట్లు..సంగారెడ్డిపై సీఎం వరాల జల్లు..

ప్రతి మున్సిపాలిటీకి రూ.30 కోట్లు..సంగారెడ్డిపై సీఎం వరాల జల్లు..

ప్రతి మున్సిపాలిటీకి రూ.30 కోట్లు..సంగారెడ్డిపై సీఎం వరాల జల్లు..
X

సంగారెడ్డి జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30కోట్లు, ప్రతి డివిజన్ కు రూ.10కోట్లు ఇస్తామని ప్రకటించారు. రెవెన్యూ డివిజయ్ చేయాలన్న ప్రజల డిమాండ్ ను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. పటాన్‌చెరులో రూ.183 కోట్లతో నిర్మించనున్న 2000 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

24 గంటల కరెంట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పటాన్ చెరు వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ అన్నారు. గతంలో పటాన్‌చెరు ప్రాంత ప్రజలు కరెంట్‌ కోతలతో ఇబ్బంది పడేవారని, విద్యుత్ కోసం సమ్మెలు చేసేవారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం 24 గంటల కరెంటు సరఫరా జరుగుతుండటంతో పరిశ్రమలు 3 షిప్టుల్లో నడుస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక రంగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ అన్నారు.

ఐటీ కంపెనీల ఏర్పాటు..

వచ్చే ఐదేళ్లలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పటాన్ చెరు ప్రాంతం అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్తులో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రామసముద్రం చెరువును త్వరలోనే సుందరీకరిస్తామని అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటింటికి మంచినీళ్ల సరఫరా, కేసీఆర్ కిట్టు ఇలాంటివి దేశంలో ఎక్కడ ఉండవని, కాలేశ్వరం నిర్మాణంతో కరువును లేకుండా చేశామని చెప్పారు.

పెరిగిన భూముల ధరలు

భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగగా ఏపీలో తగ్గాయని చెప్పారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు వస్తాయని ఇటీవలే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సమైక్య శక్తుల కుట్రలు పటాపంచలు అయ్యాయన్న ఆయన.. మంచి ప్రభుత్వం, అభివృద్ధి పనులతో భూముల ధరలు పెరిగాయని చెప్పారు.


Updated : 22 Jun 2023 4:36 PM IST
Tags:    
Next Story
Share it
Top