Home > తెలంగాణ > Rain Alert.. సీఎం ఆదేశం.. రేపు విద్యాసంస్థలకు సెలవు

Rain Alert.. సీఎం ఆదేశం.. రేపు విద్యాసంస్థలకు సెలవు

Rain Alert.. సీఎం ఆదేశం.. రేపు విద్యాసంస్థలకు సెలవు
X

భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శనివారం, జులై 21) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. మొదట జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలను మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరో 24గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.


Updated : 21 July 2023 10:31 PM IST
Tags:    
Next Story
Share it
Top