Home > తెలంగాణ > Title : మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ నియామకం

Title : మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ నియామకం

Title : మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ నియామకం
X

తెలంగాణలో కార్పోరేషన్ల పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో అన్ని సామాజిక వర్గాలు, ఆయా నియోజవకర్గాల్లోని పరిస్థితుల ఆధారంగా పదవులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకేసారి మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియామకయ్యారు. డైరెక్టర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ‌పేట్ జిల్లాలోని మద్దూర్ మండలానికి చెందిన మొహమ్మద్ సలీంలను నియమించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను నియమించారు.

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌ప‌ల్లి మండలం మార్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని నియమించారు. ఈ పదవుల్లో వారు రెండేళ్లు కొనసాగనున్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిపారు.

Updated : 6 July 2023 8:58 PM IST
Tags:    
Next Story
Share it
Top