Home > తెలంగాణ > సాయిచంద్ దశదినకర్మకు సీఎం కేసీఆర్

సాయిచంద్ దశదినకర్మకు సీఎం కేసీఆర్

సాయిచంద్ దశదినకర్మకు సీఎం కేసీఆర్
X

బీఆర్ఎస్ నేత‌, తెలంగాణ ఉద్యమ‌కారుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. ఆయన ద‌శ‌దిన క‌ర్మను సాగ‌ర్ రోడ్డులోని హస్తినాపురం బిఎస్ఆర్ క‌న్వెన్షన్ హాలులో ఈరోజున(ఆదివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు కేసీఆర్. సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రెండు రోజుల క్రితమే సాయిచంద్‌ కుటుంబానికి రూ.1.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ప్రకటించింది. అలాగే సాయిచంద్ భార్యకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ పదవిని సైతం ఇవ్వనున్నట్లు నియామక పత్రం అందజేశారు. ఆ ఆర్థిక సాయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతం నుంచి ఇవ్వనున్నారు.

సాయిచంద్‌ అకస్మిక మరణంతో బీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సాయిచంద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి.. తెలంగాణ ఉద్యమానికి తన స్వరంతో ఊపుని తీసుకువచ్చారు. చీకటిలో ఉన్న తెలంగాణ యువతను తన గళంతో మేల్కొలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన్నలు పొందిన.. ఆ తర్వాత రాష్ట్ర గిడ్డంగులు సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

Updated : 9 July 2023 8:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top