Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మంచోడు - బీజేపీ ఎంపీ అర్వింద్

రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మంచోడు - బీజేపీ ఎంపీ అర్వింద్

రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మంచోడు - బీజేపీ ఎంపీ అర్వింద్
X

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ మంచిడని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశమేలేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో వస్తే బీజేపీ సర్కారు లేదా హంగ్ ఏర్పడుతుందని అర్వింద్ జోస్యం చెప్పారు. హంగ్ వస్తే ఎన్నికల తర్వాతి రాజకీయాలు ఎలా చేయాలో అలా చేస్తామని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ గట్టిగా ఉందని ప్రచారం నడుస్తోందని అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని భయంకరంగా మార్చేస్తాడని, ఈ విషయంలో ఆయన కన్నా కేసీఆర్ బెటర్ అని అర్వింద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను పైకి లేపుతున్నదే కేసీఆర్ అని విమర్శించారు. ఆ రెండు పార్టీలతో జనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కేసీఆర్ కుటుంబానికి ఓటమి రుచి చూపించిన పార్టీ బీజేపీ అని అర్వింద్ అన్నారు. మెట్ పల్లి, కోరుట్లలోనే కాకుండా రాష్ట్రం అంతటా బీజేపీ రంగంలోకి దిగితే ఎట్లుంటదో బీఆర్ఎస్కు రుచి చూపించాలని పిలుపునిచ్చారు.

Updated : 5 Nov 2023 8:45 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top