Home > తెలంగాణ > జడ్జీగారి ప్రమాణ స్వీకారం.. ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్..

జడ్జీగారి ప్రమాణ స్వీకారం.. ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్..

జడ్జీగారి ప్రమాణ స్వీకారం.. ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్..
X

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అరాధేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసుల మేరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆరాధే నియామకానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. గత బుధవారంనాడు భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల తర్వాత జస్టిస్ ఆలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. అంతకుముందు ఆయన కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

కాగా, సీఎం కేసీఆర్ దాదాపు 13 నెలల విరామం తర్వాత మళ్లీ రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం వేళ ఈ చర్చ ఆసక్తి కరంగా మారింది. గతేడాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌ భవన్‌ కు వచ్చి గవర్నర్‌‌ తమిళిసైతో వేదిక పంచుకున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు కూడా చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు.






Updated : 23 July 2023 6:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top