Home > తెలంగాణ > చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
X

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్ధిపేట మండలంలోని చింతమడకలో ఆయన ఓటు వేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణి శోభతో కలిసి పోలింగ్ స్టేషన్ కు వెళ్లిన కేసీఆర్ గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్. సీఎం దంపతులు ఓటేసేందుకు రావడంతో అక్కడ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఓటర్ లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158కాగా.. ఆయన సతీమణి శోభ సీరియల్‌ నంబర్ 159గా ఉంది.

ఉదయం నుంచి చింతమడక పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు ఎక్కువగా కనిపించలేదు. అయితే కేసీఆర్ వచ్చే సమయానికి ఒకేసారి జనమంతా ఓటు వేసేందుకు తరలివచ్చారు. దీంతో అక్కడ భారీ క్యూ కట్టారు.

Updated : 30 Nov 2023 1:25 PM IST
Tags:    
Next Story
Share it
Top