Home > తెలంగాణ > అది భూమాత‌నా.. భూమేత‌నా..? కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సెటైర్లు

అది భూమాత‌నా.. భూమేత‌నా..? కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సెటైర్లు

అది భూమాత‌నా.. భూమేత‌నా..? కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సెటైర్లు
X

75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి రాలేదని, ఏ దేశంలో అయితే వచ్చిందో ఆ దేశాలన్నీ ముందుకుపోతున్నాయన్నారు సీఎం కేసీఆర్. ఎలక్షన్లు చాలాసార్లు వస్తయ్‌ పోతయ్‌. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరుండే ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటును జాగ్రత్తగా వినియోగించాలి. ఏమాత్రం కిందిమీద చేసిన గడబిడ అవుతుందంటూ హెచ్చరించారు. స్టేషన్ ఘన్‌పూర్ లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలన్నారు. దానికంటే ముఖ్యంగా అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వైఖరి, ఎలా ఆలోచిస్తరు ? ఎవరికి మేలు చేస్తరు ? ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచన ఉంటది? ఆ పార్టీల చరిత్రను కూడా చర్చ చేసి నిర్ణయించుకోవాలన్నారు.

రాయి ఏదో రత్నమేదో ఆలోచించాలని కోరుతున్నానని చెప్పారు. "బీఆర్‌ఎస్‌ చరిత్ర మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ రాష్ట్రం కోసం. చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమమంతా మీ కండ్ల ముందే జరిగింది. మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన సమయంలో చాలా సమస్యలున్నయ్‌. కరెంటు లేదు. నీళ్లు లేవు. వలసలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే. వాటన్నింటిపై మధనం చేసి ఆలోచన చేసుకొని ఓ పంథాతో ముందుకెళ్లాం" అని తెలిపారు.

"15 ఏండ్లు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గమనించాలి. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో స్టేషన్ ఘన్ పూర్ ఎలా ఉందో ఆలోచించాలి

14 ఏండ్ల క్రితం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ వచ్చాక ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తున్నాం. పెన్షన్ రూ.200 నుంచి 2 వేల రూపాయలకు పెంచుకున్నాం. మరోసారి ప్రభుత్వం వస్తే సంపద పెరిగితే పెన్షన్ ను రూ. 5000 కు పెంచుతాం. నియోజకవర్గ రైతుల కోసం రైతు బీమా,రైతు బంధు, 24 గంటల నిరంతర విద్యుత్ తో పాటు దేవాదుల ద్వారా వచ్చే నీళ్లకు ట్యాక్స్ లేకుండా చేశాం" అని అన్నారు.

"ధ‌ర‌ణి తీసి బంగాళాఖాతంలో వేస్త‌రట కాంగ్రెసోళ్లు. వాళ్లు వ‌స్తే వ‌చ్చినాటికి స‌చ్చినాటికి కానీ. కాంగ్రెస్ మాట‌ల‌ను మీరంతా విమ‌ర్శించాలి. ధ‌ర‌ణి తీసి బంగాళాఖాతంలో వేసి భూమాత పెడుతర‌ట‌. అది భూమాత‌నా.. భూమేత‌నా..? మ‌ళ్లా వీఆర్‌వోల‌ను తీసుకొస్తాం. 34 కాల‌మ్స్ పెడుతాం. కౌలుదార్ల కాలం పెడుతాం. అంటే రైతుల‌కు కౌలుదార్ల‌కు జుట్లు జ‌ట్లు ముడేస్త‌ర‌..? ధ‌ర‌ణి తీస్తే రైతుబంధు ఎలా వ‌స్తుంది. మ‌ళ్లా వీఆర్వోలు, అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్లు సంత‌కం, స‌ర్టిఫికెట్ తీసుకురా అంట‌రు. మ‌ళ్లీ లంచాలు, ద‌ళారీల రాజ్యం, వీఆర్ఎవోల రాజ్యం వ‌స్త‌ది" అని కేసీఆర్ మండిప‌డ్డారు.


Updated : 20 Nov 2023 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top