Home > తెలంగాణ > మీకే దిక్కులేదు.. మాకు నీతులు చెప్తరా..? కాంగ్రెస్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

మీకే దిక్కులేదు.. మాకు నీతులు చెప్తరా..? కాంగ్రెస్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

మీకే దిక్కులేదు.. మాకు నీతులు చెప్తరా..? కాంగ్రెస్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
X

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అచ్చంపేట ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. సవాళ్లు విసరడమే రాజకీయమా అని ప్రశ్నించారు. కొడంగల్‌కు రమ్మని ఒకరు.. గాంధీ బొమ్మ దగ్గరకు రమ్మని మరొకరు తనకు సవాల్ విసురుతున్నారని కేసీఆర్ అన్నారు. తన దమ్మేంటో దేశమంతా చూసిందని, కొత్తగా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 30న దుమ్ము రేగాలన్న కేసీఆర్.. ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ ను గెలిపించి డిసెంబర్ 3న మళ్లీ దుమ్ము రేపాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీకే దిక్కులేకుండా పోయిందని, అయినా నీతులు చెప్పేందుకు వస్తున్నారని కేసీఆర్ సటైర్ వేశారు. ఎవరు ఎవరికి ఉపన్యాసాలు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. దేశంలో రైతుబంధు పుట్టించిందే కేసీఆర్‌ అన్న బీఆర్ఎస్ అధినేత రైతు మెడపై కత్తిపెట్టడమే తప్ప వారికి రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. దేశంలో 24 గంటల కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న కేసీఆర్.. కర్నాటకలో కాంగ్రెస్ 20 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి కనీసం 5 గంటలు కూడా ఇస్తలేరని అన్నారు. కరెంటు కోసం ఆ రాష్ట్ర రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు.

అధికారంలోకి ధరణి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అంటోందని కేసీఆర్ గుర్తు చేశారు. అదే జరిగితే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇస్తామంటే జనారెడ్డి సవాల్ విసిరాడని, అది నిజం కావడంతో పారిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రైతు బంధు బంద్ అయితదని, కరెంటు కష్టాలు మళ్లీ మొదటికొస్తాయని రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయితదని అందుకే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.



Updated : 26 Oct 2023 11:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top