Home > తెలంగాణ > జీహెచ్ఎంసీలో రెండ్రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..

జీహెచ్ఎంసీలో రెండ్రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..

జీహెచ్ఎంసీలో రెండ్రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..
X

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సైతం శుక్ర, శనివారాలు సెలవులు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు వానలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పతుండడంతో సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

Updated : 20 July 2023 9:07 PM IST
Tags:    
Next Story
Share it
Top