Sittings MLA's Out : కేసీఆర్ మార్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
X
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈసారి 7 సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేశారు. వివిధ కారణాలతో ఆయా సీట్లలో క్యాండిడేట్లను మార్చినట్లు చెప్పారు.
వేములవాడలో పౌరసత్వ సమస్యల కారమంగా ఈసారి చెన్నమనేని రమేష్ కు అవకాశం ఇవ్వలేదని కేసీఆర్ ప్రకటించారు. ఆ స్థానం నుంచి చెల్మెడ లక్ష్మీ నర్సింహారావుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఖానాపూర్ నుంచి రేఖా నాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ నాయక్ ను బరిలో దింపనున్నారు. ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మీ, విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా కోరుట్ల టికెట్ ను కల్వకుంట్ల సంజయ్కు టికెట్ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ లో తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి, వైరాలో రాములు నాయక్ ను తప్పించి బానోత్ మదన్ లాల్ కు అవకాశం ఇచ్చారు.
జనగాం, గోషా మహల్, నాంపల్లి, నర్సాపూర్ స్థానాల్లో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. త్వరలోనే ఆయా స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లు ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు.