Home > తెలంగాణ > మైనంపల్లి హనుమంతరావుకి షాక్..కొడుకు పట్టించుకోని కేసీఆర్

మైనంపల్లి హనుమంతరావుకి షాక్..కొడుకు పట్టించుకోని కేసీఆర్

మైనంపల్లి హనుమంతరావుకి షాక్..కొడుకు పట్టించుకోని కేసీఆర్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. 7 స్థానాల్లో మాత్రమే మార్పులు చేసి..మొత్తం 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా అభ్యర్థుల జాబితాలో పెద్దగా మార్పులు లేకుండానే కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో ఆశావాహులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలపై కన్నేసి ప్రజలతో మమేకమవుతున్న ఆశావాహులకే కేసీఆర్ ప్రకటన మింగడు పడటం లేదు.

మైనంపల్లికి షాక్





తనతో పాటు కుమారుడిని బరిలో నిలపాలని చూసిన మైనం పల్లి హనుమంతరావుకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు .. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రోహిత్‌ను మెదక్ ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని భావించారు. ఈక్రమంలో గత కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ నియోజవర్గంలో తిరుగుతున్నారు. పలు సేవ కార్యక్రమాల్లో మైనంపల్లి రోహిత్ పాల్గొంటున్నారు. వచ్చేఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా పలు మార్లు స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే కుమారుడు టికెట్ విషయంలో మైనంపల్లి డిమాండ్ పార్టీ పట్టించుకోలేదు. మరోసారి మెదక్ అసెంబ్లీ టికెట్‎ను పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు.

హరీష్ రావు ఫైర్





టికెట్ల ప్రకటనకు ముందు తిరుమలకు వచ్చిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంత రావు నేరుగా మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. మెదక్‎లో హరీష్ రావు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మెదక్‎లో తన కుమారుడు మైనంపల్లి రోహిత్‎ను ఖచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పారు. తన కుమారుడికి మెదక్ సీటు ఇస్తేనే తాను పోటీ చేస్తానని హనుమంతరావు స్పష్టం చేసారు. మల్కాజ్ గిరిలో తాను పోటీ చేస్తానని..మెదక్ లో తన కుమారుడిని ఖచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పారు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని హరీష్ రావు అడ్డుకున్నారని..అవసరమైతే తన తడాఖా ఏంటో చూపించి హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ లిస్ట్‌లో అతని కుమారుడు రోహిత్‌కు సీటు కేటాయించలేదు. ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated : 21 Aug 2023 4:39 PM IST
Tags:    
Next Story
Share it
Top