Home > తెలంగాణ > 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు

30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు

30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు
X

తెలంగాణలో గిరిజనులకు, గిరిజనేతరులకు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణలకు దారి తీస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన గిరిజనులకు జూన్ 30 వ తేదీ నుంచి పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిజానికి ఈ కార్యక్రమం శనివారమే (24) ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదాపడింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడంతోపాటు ఎన్నిక నిర్వహణపై శుక్రవారం, శనివారం జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు, 29న బక్రీద్ పండుగ వల్ల కార్యక్రమాన్ని జూన్ 30కి మార్చారు.

ఆ రోజు కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోలాంఛనంగా పోడు భూముల పట్టాలు అందజేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో పట్టాలను పంపిణీ చేస్తారు. అదే రోజు కేసీఆర్ ఆసిఫాబాద్‌లో నిర్మించిన కొత్త కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూములకు సంబంధించిన ఘర్షణలో గుత్తికోయలు శ్రీనివాసరావు అనే అటవీ శాఖ అధికారిని హత్య చేయడం తెలిసిందే. వివాదాస్పద భూమిని ఇరవై ఏళ్లుగా తాము దున్నుకుంటున్నామని గుత్తికోయలు వాదిస్తుండగా అది అటవీ భూమి అని ఫారెస్ట్ రేంజర్లు అంటున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి వివాదాలు ఉన్నాయి.

Updated : 24 Jun 2023 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top