Home > తెలంగాణ > కాంగ్రెస్ వస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టే - కేసీఆర్

కాంగ్రెస్ వస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టే - కేసీఆర్

కాంగ్రెస్ వస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టే - కేసీఆర్
X

ప్రజల హక్కుల రక్షణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు. ధర్మపురిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే పాత దుకాణం మొదలైతదని, ప్రజల పరిస్థితి కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లవుతుందని హెచ్చరించారు.

తెలంగాణ వచ్చి పదేండ్లు మాత్రమే అయినా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు, మంచినీళ్ల కొరత లేదని, ధర్మపురిలో 30లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. రైతు బంధుతో అప్పులు కట్టుకుని అన్నదాతల బాధలు తప్పాయని అన్నారు. రైతు బంధు, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు, ధాన్యం కొనుగోలుతో రైతులను ఆదుకుంటున్నామని కేసీఆర్ స్పష్టంచేశారు.

రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి తెలుసా అని కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని చెప్పారు. పైరవీకారులు, అధికారుల బాధ తప్పించేందుకే ఈ పోర్టల్ తెచ్చినట్లు చెప్పారు. రైతు బీమా కింద రూ. 5లక్షలు ఇచ్చి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్ర తలసరి ఆదాయం, తాగు నీరు, కరెంటు సరఫరా, వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందని కేసీఆర్ అన్నారు. కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే హుజూరాబాద్ లాగే ధర్మపురి నియోజకవర్గమంతా దళిత బంధు అమలుచేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.


Updated : 2 Nov 2023 11:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top