Home > తెలంగాణ > CM KCR: పార్టీపై ఫుల్ ఫోకస్.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ మాస్ వార్నింగ్!

CM KCR: పార్టీపై ఫుల్ ఫోకస్.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ మాస్ వార్నింగ్!

CM KCR: పార్టీపై ఫుల్ ఫోకస్.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ మాస్ వార్నింగ్!
X

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇవాళో రేపో ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరగొచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. హామీలు, ప్రమాణాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస, బీజేపీ పార్టీలు.. ఎమ్మెల్యేల లిస్ట్ పై కసరత్తులు మొదలుపెట్టాయి. ఇక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన హాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తుంది. అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచే సమీక్షకు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని కొందరు అసంతృప్త నేతలు, టికెట్ రాని అభ్యర్థులు పార్టీ మారుతుండగా.. టికెట్ కన్ఫార్మ్ అయిన అభ్యర్థుల పనితీరుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఎలక్షన్లకోసం ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రౌండ్ వర్క్ పై అధినేత కేసీఆర్ ఆరా తీసి మరీ మందలించినట్లు సమాచారం. కొంతమంది పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. టికెట్ దక్కాక కూడా చాలామంది హైదరాబాద్ కు తరచూ వస్తూ పోతుండటంపై ఆయన మండిపడుతున్నారు. నియోజక వర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లకు దగ్గర కావాలని సూచిస్తున్నారు. పనితీరు మార్చుకోని అభ్యర్థులకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఎవరూ ఉండకూడదని.. ఎవరి నియోజక వర్గాల్లో వారు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కోరారు. పార్టీని మరింత బలంగా మార్చాలని కేసీఆర్ గట్టిగానే చిప్పినట్లు పార్టీ శ్రేణులు అంటున్న మాట. పనితీరు మార్చకోకపోతే వారి స్థానంలో వేరొకరికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Updated : 7 Oct 2023 9:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top