Home > తెలంగాణ > CM KCR Greetings : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

CM KCR Greetings : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

CM KCR Greetings : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
X

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ (Bathukamma panduga) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవటం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞతాభావనను తెలియజేస్తాయని చెప్పారు.

సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకొనే బతుకమ్మ (Bathukamma) పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని వెల్లడించారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థించారు.

బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా కొన్నిరోజుల కిందట సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని చెప్పారు. ఇక తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 22 Oct 2023 9:03 AM IST
Tags:    
Next Story
Share it
Top