ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. త్వరలోనే పీఆర్సీ,
X
తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని కూడా ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ ఛైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సమావేశంలో నేతలు ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డుల అంశాలపై చర్చించారు. అనంతరం ఉద్యోగ జేఏసీ నేతలు పీఆర్సీతోపాటు ఐఆర్ (మధ్యంతర భృతి) కూడా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తమకు హామీనిచ్చినట్లు మీడియాకు తెలిపారు అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య పథకాన్ని కూడా అమలుకు సిద్దంగా ఉన్నారని తెలిపినట్లు ప్రకటించారు.
ఉద్యోగులకు రెండో పీఆర్స్సీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల చందాతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈట్రస్ట్ ద్వారా వైద్యసేవాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర తీసుకొచ్చిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సమస్యల పరిష్కరిస్తామని చెప్పారు. ఉద్యోగులు, పింఛనుదారులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రెండు రోజుల్లో పీఆర్సీ, మధ్యంతర భృతిని ప్రకటిస్తామనికేసీఆర్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
శుక్ర లేదా శనివారాల్లో పీఆర్సీ, ఐఆర్ గురించి అసెంబ్లీలోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు జేఏసీ చైర్మన్ రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పీఆర్‌సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులమంతా అండగా ఉంటామని జేఏసీ నేతలు చెప్పారు. మొన్ననే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తద్వారా ఆర్టీసీ కార్మికుల్లోని వ్యతిరేకతను తొలగించే ప్రయత్నం చేసినట్టయింది.