Home > తెలంగాణ > cm kcr : సూర్యాపేట బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

cm kcr : సూర్యాపేట బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

cm kcr : సూర్యాపేట బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
X

సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణసలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అంతకుముందు రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీకి సంబంధించిన బిల్డింగులను కేసీఆర్ ప్రారంభించారు.

మెడికల్ కాలేజీ నుంచి వ్యవసాయ మార్కెట్ కు చేరుకున్న సీఎం కేసీఆర్.. రూ.30.18 కోట్లతో నిర్మించిన ఇంటెగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించారు. మార్కెట్‌ అంతా కలియతిరిగి పరిశీలించారు. ఆ తర్వాత రూ.38 కోట్లకుపైగా వ్యయంతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్‌ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌ తదితరులు ఉన్నారు.

Updated : 20 Aug 2023 4:06 PM IST
Tags:    
Next Story
Share it
Top