కుమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
X
సీఎం కేసీఆర్ కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు కాసేపటి క్రితమే ఆయన.. సిద్ధిపేట నుంచి హెలికాప్టర్ ద్వారా.. ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ముందుగా.. కుమ్రంభీం చౌరస్తాకు చేరుకొని, కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్పకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.
ఇక మరికాసేపట్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు కేసీఆర్. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగసభలో పాల్గొననున్నారు.