Home > తెలంగాణ > రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
X

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ గ్రామ సమీపంలో నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్‌ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు. కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మేథా ఎండీ కశ్యప్‌రెడ్డి ఉన్నారు.





ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ మొత్తం చూశానని.. రైల్వే విడి భాగాలు ఎంతో బాగా స్కిల్‌తో చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఇంత అద్భుతమైన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మేధా గ్రూప్ కుటుంబానికి అభినందనలని చెప్పారు. తెలంగాణ బిడ్డలే రైలు కోచ్‌లు, విడిభాగాల తయారుచేయడం గర్వకారణం అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కఠినమైన విధానాలతో తెలంగాణ టీఎస్ ఐపాస్ తీసుకొచ్చామని చెప్పారు. ఇందుకోసం 70 నుంచి 80 దేశాల విధానాలను పరిశీలించామని తెలిపారు. సింగిల్ విండో విధానం తీసుకొచ్చి.. 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారుల టేబుల్‌పై ఫైల్ ఆగితే రోజుకు రూ. 1,000 రూపాయలు ఫైన్ వేస్తున్నట్టుగా చెప్పారు.

Updated : 22 Jun 2023 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top