కొల్లూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్
X
తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొన్నా. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ వీక్షించారు. కొల్లూరులో దాదాపు 142 ఎకరాల విస్తీర్ణంలో 15,660 కుటుంబాలకు వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపట్టింది. 117 బ్లాక్‌లలో రూ. 1,489 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ తరహా అపార్ట్‌మెంట్‌లలో ఇది అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం. ఇందులో కొన్ని అపార్ట్‌మెంట్‌లు G+9 అంతస్తులతో ఉండగా, కొన్ని G+10 అంతస్తులతో ఉన్నాయి. దీనిని ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయంగా చెబుతున్నారు.
ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఆధునిక హంగులు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవసరమైన నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా కోసం 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సముదాయంలో 118 దుకాణాలను నిర్మించిన ప్రభుత్వం.. వాటిని అద్దెకు ఇవ్వనుంది. ఇక, పటాన్‌చెరులో రూ. 185 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.