Home > తెలంగాణ > భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
X

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్‌ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్.

నీట మునిగిన మోరంచపల్లి

కాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలటరీ అధికారులతో సీఎస్‌ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కాగా, మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. సైన్యం అనుమతించిన వెంటనే హెలికాప్టర్ ద్వారా కూడా సహాయక చర్యలను చేపట్టనున్నారు. భారీ వర్షాలకు మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది.

రికార్డు స్థాయిలో వర్షపాతం

కాగా మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. ములుగు జిల్లా వాజేడులో గత 2013 జులై 19 తరవాత తిరిగి గడచిన 24 గంటలలో 51.5 సెం. మీల వర్షం పడింది. గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం. మీల వర్షం పడింది. గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షపాతం నమోదైంది. 200ల కేంద్రాల్లో 10 సెం. మీల పైగా వర్షం కురిసింది. మొన్న నిజామాబాద్ జిల్లాలో 45 సెం. మీల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షపాతాలపై వాతావరణ శాఖ విస్మయాన్ని వ్యక్తంచేస్తుంది. ఈ వర్షాలపై అధ్యయనం చేసేందుకు ఉపక్రమిస్తుంది.



Updated : 27 July 2023 12:17 PM IST
Tags:    
Next Story
Share it
Top